ఎన్నో ఇబ్బందులు, కాలిక్యేషన్ల మధ్య ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్ గా నిలవడానికి పలు కారణాలున్నాయి. ఈ చిత్రంలో జరిగిన పరిణామాలను రచయిత రాధాకృష్ణ శిరిగినీడి ఇలా తెలియజేస్తున్నారు.
మోసగాళ్ళకు మోసగాడు హిట్ అయ్యి మంచి ఊపు మీద ఉన్న కృష్ణ కి ప్రభాకర రెడ్డి కథ తయారు చేసుకుని సినిమా తీద్దామని కథ చెపితే .. నేనే తీస్తాను.. అంటే లేదు నాకు కూడా భాగస్వామ్యం కావాలని పట్టు బడితే.. కథ ను వదులుకోలేక ఒప్పుకున్నాడు కృష్ణ.. బ్యానర్ పేరు జయప్రద పిక్చర్స్.. కృష్ణ సమర్పించు.. కృష్ణ తమ్ముడు జి . హనుమంత రావు నిర్మాత గా పేర్లు వేసుకున్నారు. కథ కుదిరింది కానీ నటీ నటులు గా ఎవరు సరిపోతారు
ఇది నలుగురు అన్నదమ్ముల కథ..చాలా రోజుల చర్చల తర్వాత పెద్దన్న గా యస్వీ రంగారావు.. రెండోవాడిగా గుమ్మడి..మూడో అన్న పాత్ర ముందే ప్రభాకర్ రెడ్డి.. రిజర్వ్ చేసుకున్నాడు.. నాలుగో సోదరుడు గా హీరో కృష్ణ... ఒదిన పాత్రకు సాత్విక అభినయం చేసే దేవిక.. అప్పటి వరకు ముద్దు ముద్దు మాట్లాడుతూ..అమాయకం గా నటించే బి. సరోజా దేవి కి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర ఇవ్వడం.. కృష్ణ పక్కన వేరే ఆప్షన్ లేదు.. విజయ నిర్మల.. సినిమా లో ముఖమైన రాణి మాలిని దేవి క్యారెక్టర్ గురించి చాలా రోజులు ఆలోచించి. భానుమతి ని బుక్ చేశారు.. షూటింగ్ సమయం లో ఏవో ఇబ్బందులు వచ్చి ఆ పాత్ర జమున కి దక్కింది.
కామెడీ కి రాజబాబు..అల్లు..ఇలా అనుకొని మొదలెట్టిన సినిమా. 150 రోజుల్లో తీద్దామని మొదలెట్టి..90 రోజుల్లోనే పూర్తిచేశారు.. ఒకసారి షూటింగ్ కి మొత్తం సినిమా లోని ఆర్టిస్ట్ లు అందరూ వచ్చారు..కానీ ఎస్వీఆర్ మాత్రం మందు ఎక్కువై పోయి రాలేదు.. అందరూ చాలా సేపు వెయిట్ చేశారు.. ప్రభాకర రెడ్డి ని వెళ్ళి ఆయన్ను తీసుకు రమ్మని కృష్ణ పంపాడు. షూటింగ్ కి వస్తూనే..నేను ఇవాళ చేయలేనురా... అన్నాడు ఎస్వీఆర్. ప్రభాకర రెడ్డి కి కోపం వచ్చి ఇంతమంది మీ కోసం ఎదురు చూస్తున్నారు.
చంపుతా ..అని ఎస్వీఆర్ మీదకి వెళ్ళాడట.. గ్రేట్ రంగారావు నే చంపుతావా .. చంపరా అని అంటే... ప్రభాకర రెడ్డి మెత్తబడి పోయి ఏదో అవేశం లో అనేశాను అని ఎస్వీఆర్ కాళ్ళు పట్టుకుని..మీ ఇష్టం..ఈ రోజు వద్దులెండి..అని ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి ఇంటికి పంపేశారు..ఈ తతంగం అంతా చూస్తూ.. విసిగి పోయిన గుమ్మడి..ఆయన తో ఇబ్బంది పడటం ఎందుకు?వేరే వాళ్ళ తో చేయించండి అని కృష్ణ కి సలహా ఇచ్చారట..అపుడు కృష్ణ..ఈ క్యారెక్టర్ ఆయనే చెయ్యాలి. ఆయన ఎప్పుడు వస్తె అప్పుడే షూటింగ్.. అన్నాడట .ఇది తెలిసిన రంగారావు కృష్ణ తో..ఇక ఈ సినిమా షూటింగ్ అయ్యేవరకు తాగను ..ఈ సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్లకు ఈ రంగారావే గుర్తుకొస్తాడు అని ఛాలెంజ్ చేసి మరీ పూర్తి చేశారు.
1972 జూలై 21 న రిలీజ్ అయి.. సినిమా బ్లాక్ బస్టర్ అయింది.21కేంద్రాలలో 100 రోజులు..మెయిన్ సెంటర్ లలో సిల్వర్ జూబ్లీ.. హైద్రాబాద్ లో 365 రోజులు ఆడింది..1972 లో కృష్ణ వి 18 సినిమా లు రిలీజ్.. తెలుగు లో ఇప్పటికీ ఈ రికార్డ్ ఎవరు బ్రేక్ చెయ్యలేదు.12 లక్షల్లో భారీ బడ్జెట్ తో తీశారు..కొన్ని రెట్లు లాభాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం గా ఎంపికయ్యింది 1972 సం.లో..
ఈ సినిమా గురించి మాట్లాడితే..ముందు గా ఎస్ వీ.. రంగారావు గురించే.. సినిమా మొదటి నుండి చివరి ఫ్రేమ్ వరకు ఆయనే ఉంటారు.. కుటుంబ పెద్ద గా హుందాగా, హీరోయిన్ తో ఇంగ్లీష్ మాట్లాడుతూ కామెడీ, తమ్ముడు భార్య పై కోపం వచ్చినప్పుడు రౌద్రం .. కుటుంబం చితికి పోయినప్పుడు.. రైల్వే కూలీ గా కృష్ణ కి ఎదురు పడినప్పుడు... పిల్లవాడు చనిపోయినప్పుడు.. ఏమిరా ఇలా చేశావ్ ? అంటూ పిల్లవాడి మీద మట్టి వేసే సీన్ లో ..ఆయన నటన కి పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకూ భోరున ఏడుస్తారు.
ఇలా అన్ని రసాలు పండించారు.. చివరిలో జమున కాంబినేషన్ లో వచ్చే సీన్ లో ఆయన నటన పరాకాష్ట కు చేరింది.. విశ్వరూపం చూపించారు..ఈ సీన్ కూడా ఆయన తాగి చేశారట.. కట్ చెప్పినా ఆలాగే ఫ్రేమ్ లో మత్తుగా ఉండిపోయారట.. ఆయన తాగి చేసినా.. తాగకుండాచేసినా. ఆయన లో మహానటుడు మాత్రం అలాగే ఉంటాడు.. ఇలాంటి నటులు చాలా అరుదు. అందుకే ఆయన యశస్వి అయ్యారు.
ఏ సినిమా కయినా ప్రేక్షకుల ను కట్టిపడేసే..ఒక ట్విస్ట్ ఉంటే ఆ సినిమా కి తిరుగు ఉండదు. అలాంటి సీన్.. చివరిలో ఎస్వీఆర్ అప్పటి వరకు మనం తన కూతురు అనుకుంటున్న జయసుధ ను.. జమున కూతురు అని చెప్పడం..ఆ సీన్ థియేటర్ లో అందరూ ఆశ్చర్యంగా చూసి పులకించి పోయారు.....
50 ఏళ్ల క్రితమే అలాంటి ట్విస్ట్ పెట్టడం దర్శకుడు గొప్పతనం. తర్వాత చెప్పాల్సిన పాత్ర జమున.. ఆవిడ నట జీవితంలో కలికి తురాయి..ఈ సినిమా.. భానుమతి ఫోన్ చేసి మరీ చెప్పారట.. నాకన్నా బాగా చేశావు అని..తల్లిగా, పగ తీర్చుకుని బాధపడే మహిళగా.. ఆమె నటన హ్యాట్సాఫ్..మనసా కవ్వించకే..పాట ఒకటి చాలు. ఆవిడ అభినయ కౌసల్యానికి. మిగతా పాత్రలలో ఎక్కువ మార్కులు దేవిక కి,, తర్వాత బి. సరోజాదేవి కి.. కృష్ణ.. విజయనిర్మల జంట బాగుంటుంది.. లక్ష్మీ దీపక్ దర్శకత్వం.. కోదండపాణి సంగీతం లో బాబూ వినరా పాట అప్పట్లో సూపర్ హిట్..
మద్దిపట్ల సూరి మాటలు.. వి ఎస్ ఆర్ స్వామి ఫోటోగ్రఫీ.. అన్నీ ఈ సినిమా కి ప్రాణం పోశాయి.. జయసుధ మొదటి సినిమా.. టైటిల్స్ లో సుజాత అని ఉంటుంది..జమున కూతురు గా.. పరిచయం చేశారు.. విజయనిర్మల కి మేనకోడలు వరస అవుతుంది కదా.. ఇందులో నరేష్ కూడా గుమ్మడి కొడుకు గా బాలనటుడు గా కనిపిస్తాడు..
చిన్న చిన్న కుటుంబాలు గా మారిపోతున్న ఈ రోజుల్లో అప్పటి ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉండేవో.. వారి అనుబంధాలు ఎలా ఉండే వో ఈ తరం తెలుసు కోవాలంటే.. ఇలాంటి సినిమాలు చూడాలి.. ఇంటిల్లిపాదీ టీవీ ముందు కూర్చొని ott లో వెదికి చూడండి.. మీకు తప్పకుండా నచ్చుతుంది..