కరోనా ఆనవాళ్లను తుడిచిపెట్టేశారు.. వైద్యుడి ఆరోపణ

సోమవారం, 27 జులై 2020 (15:34 IST)
కరోనాకు చైనా పుట్టినిల్లు అనే సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిందనే విషయం విదితమే. వైరస్‌ను నియంత్రించడంలో చైనా విఫలమైనట్లు తొలుత ఆరోపణలు వెల్లువెత్తాయి.

వైరస్ గురించి బహిర్గతం చేసిన ఓ డాక్టర్‌ను అరెస్టు చేయడంతో ఆ దేశంపై మరింత అనుమానాలు వ్యాపించాయి. అయినా మహమ్మారికి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని కూడా దాచిపెట్టలేదని చైనా చెబుతూ చెప్తోంది. 
 
ఈ వ్యవహారంపై ఇప్పటికే చైనాపై ప్రపంచ దేశాలు గుర్రుగా వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ కేసులకు సంబంధించిన ఆనవాళ్లను తుడిచిపెట్టినట్లు చైనాకు చెందిన ఓ వైద్యుడు ఆరోపిస్తున్నారు. వుహాన్‌లో వైరస్ కేసులను ప్రొఫెసర్ క్వాక్ యుంగ్ యువెన్ దర్యాప్తు చేశారు. 
 
కానీ స్థానిక అధికారులు తొలుత భౌతిక ఆధారాలను నాశనం చేసినట్లు క్వాక్ తెలిపారు. క్లినికల్ డేటాను కూడా రిలీజ్ చేయడంలో జాప్యం చేసినట్లు కూడా క్వాక్ ఆరోపించారు. వుహాన్‌లోని హువనన్ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లినప్పుడు.. అక్కడ మార్కెట్‌ను పూర్తిగా శుభ్రం చేసేశారని తెలిపారు.
 
అంటే క్రైమ్‌సీన్ కాస్తే క్లియర్ అయ్యిందని, దాంతో ఆ మార్కెట్ నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రమాదం ఉన్న హోస్ట్‌ను గుర్తించలేకపోయామని ఆ ప్రొఫెసర్ తెలిపారు.

వుహాన్ అధికారులు వైరస్ కేసులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైరస్ స్టడీ కోసం చేయాల్సిన పనులను అధికారులు అడ్డుకున్నట్లు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు