చైనా ఆర్థిక సమస్యలు ఏ క్షణమైనా టైమ్ బాంబులా పేలొచ్చు : వాల్‌స్ట్రీట్ జనరల్

సోమవారం, 21 ఆగస్టు 2023 (16:35 IST)
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న చైనాలో విపత్కర పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ ఆర్థిక సమస్యల కారణంగా డ్రాగన్ కంట్రీ తీవ్రమైన కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జనరల్ ఓ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ముఖ్యంగా, చైనా ఆర్థిక సమస్యలు పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్ బాంబులా మార్చేశాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేలా వాల్‌స్ట్రీట్ జనరల్ తాజాగా వెల్లడించిన నివేదికలో పేర్కొంది. 
 
చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనంలోకి ప్రవేశిస్తోందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారని వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ తన ప్రత్యేక కథనంలో పేర్కొంది. ప్రతికూల జనాభా సరళి, అమెరికాతోపాటు దాని మిత్ర దేశాలతో సంబంధాలు దెబ్బతినడం వంటి అంశాలు వాణిజ్యం, విదేశీ పెట్టుబడులను ప్రమాదంలో పడేస్తున్నాయని డబ్ల్యూఎస్‌జే అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ బలహీనత ప్రభావం దీర్ఘకాలం ఉండొచ్చని.. ప్రస్తుతం ఆ దేశ 'ఆర్థిక నమూనా' పేలిపోయిందని తెలిపింది.
 
చైనా ఆర్థిక చరిత్రలోనే అత్యంత భారీ మార్పును చూస్తున్నామని ఆర్థిక సంక్షోభాల వ్యవహారాల్లో నిపుణులైన కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అడమ్‌ టూజ్‌ పేర్కొన్నట్లు డబ్ల్యూఎస్‌జే పేర్కొంది. బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ డేటా ప్రకారం.. చైనా ప్రభుత్వం, దాని ఆధీనంలోని సంస్థలు కలిపి తీసుకున్న రుణాలు ఆ దేశ జీడీపీ(2022)లో 300 శాతానికి పెరిగాయని తెలిపింది. పవర్‌ కారిడార్‌ల విషయానికొస్తే.. గత దశాబ్ద వృద్ధి నమూనా దాని పరిమితులకు చేరుకుందని సీనియర్‌ అధికారులు గుర్తించినట్లు పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు