ప్రస్తుతం ఆ వ్యోమనౌక చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ల్యాండింగ్‌కు ముందు కక్ష్య (ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్)కు చేరడానికి శనివారం లూనా-25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో నిర్దేశిత పరామితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్‌కాస్మోస్ తెలిపింది.
దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపై ల్యాండింగ్‌కు రష్యా ప్రయత్నిస్తోంది. భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3.. ఈ నెల 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రదేశంలో దిగనుంది. లూనా-25 కూడా అదే ప్రాంతంలోని బొగుస్లావ్‌స్కీ బిలానికి చేరువలో 1-2 రోజుల ముందు దిగాల్సి ఉంది. ఇంతలోనే దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.