ఆప్ఘనిస్థాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్ తీవ్రవాదులతో స్నేహం చేసేందుకు డ్రాగన్ కంట్రి తహతహలాడుతోంది. పైగా, ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై చైనా ఆచితూచి స్పందించింది. ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్ ఫైటర్లతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది.
అమెరికా ఇంటెలిజెన్స్ ఊహించిన దానికన్నా ముందే మిలిటెంట్లు కాబూల్‌లో పాగా వేశారు. ఏకంగా అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న తీరు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను ఆశ్చర్యపరిచింది. తాలిబన్ల రాకతో దేశం విడిచిన వెళ్లిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. అరబ్ దేశమైన ఒమన్‌కు వెళ్లినట్లు సమాచారం ఉంది. ఆయన కోసం తాలిబన్ తీవ్రవాదులు గాలిస్తున్నారు. మరోవైపు ఆప్ఘన్ కొత్త అధ్యక్షుడుగా ఆష్రఫ్ ఘనీని ఎంపిక చేశారు.