ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కొత్త అధ్యక్షుడుగా ముల్లా బరాదర్ ఎంపికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ఘనీ ఆప్ఘాన్‌ను వదిలిపారిపోయారు. అయితే అష్రఫ్ ఘనీ ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామంటూ తాటిబన్ ప్రతి నిధులు ప్రకటన కూడా జారీ చేశారు. అదేసమయంలో ఆప్ఘన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తమ అధ్యక్షుడిగా బరాదర్ వ్యవహరిస్తామని ప్రకటించారు.