చైనా రెస్టారెంట్‌లో మనిషి కాళ్లను వడ్డించారు.. బ్లూకలర్‌ ప్లేటులో..

ఆదివారం, 15 జనవరి 2017 (10:47 IST)
ఇటలీలో ఓ చైనా రెస్టారెంట్ ఎలుగుబంటి కాళ్లను వడ్డించడమంటే.. మనిషి కాళ్లను వడ్డించింది. స్లొవేనియాకు చెందిన ఓ వ్యక్తి మిత్రలతో కలిసి ఉత్తర ఇటలీలోని పడ్వాలో ఓ చైనా రెస్టరెంటుకు వెళ్లాడు. ఇక్కడ ఎలుగు బంటి కాళ్లతో చేసే చైనా ప్రసిద్ధ వంటకం 'బెయిర్‌ పావ్స్‌'కు ఆర్డర్‌ ఇచ్చాడు. దీంతో రెండు మనిషి కాళ్లను ఓ బ్లూకలర్‌ ప్లేటులో తీసుకొచ్చి ఇవే ఎలుగుబంటి కాళ్లు అని చెప్పి వారికి వడ్డించారు. 
 
వారికి వడ్డించిన వంటకం ఇదేనంటూ ప్లేటులో మనిషి కాళ్లు ఉన్న ఫోటోను రెస్టారెంట్‌లోని ఓ వెయిటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు రెస్టారెంటులో తనిఖీ చేయగా అనుమానాస్పదంగా ఉన్న 25 కేజీల మాంసం లభించింది. దీనిని పరీక్ష కోసం తరలించారు. అదేవిధంగా సోషల్‌ మీడియాలో పోస్టైన ఫొటోనూ పరీక్షిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి