మహిళ ఒంటరిగా కనబడితే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. పలువిధాలుగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఐదు రోజుల క్రితం చైనాలో ఓ యువతి లిఫ్టులో ఒంటరిగా ఉండటాన్ని చూసిన ఓ కామాంధుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తొలుత ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఆమె వెంటనే పక్కకు తప్పుకున్నది కానీ ఏమీ అనలేదు. అదే అలుసుగా మరికాస్త చొరవ తీసుకుని ఈసారి భుజంపై చేయి వేశాడు.