కొంప ముంచిన ట్రంప్ సలహా.. కరోనా రోగులకు 'క్లీనర్‌'

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (06:21 IST)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహా ఆ దేశీయుల కొంపముంచేలా వుంది. మందులతో రోగాన్ని తరమడం సంగతలా వుంచి... అసలు ప్రాణాలకే ఎసరు తెచ్చేలా వుంది.

మానవ శరీరంలోని కరోనా వైరస్‌ను అరికట్టేందుకు గృహ పారిశుధ్య ద్రావకాలు (హౌస్‌హౌల్డ్‌ క్లీనర్‌)లను ఉపయోగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన సూచనను అక్షరాల ఆచరణలో పెట్టి తమ స్వామిభక్తిని నిరూపించుకున్నారు న్యూయార్క్‌ ఆరోగ్యశాఖ అధికారులు.

ట్రంప్‌ ఈ సూచన చేసిన 18 గంటలలోపే ఈ 'క్లీనర్‌'ల విషప్రభావానికి గురైన 30 కేసులు నమోదయినట్లు న్యూయార్క్‌ ఆరోగ్యశాఖ ప్రతినిధి వివరించారు.

ఈ 30 కేసుల్లో తొమ్మిది కేసులు లైజాల్‌ వినియోగానికి సంబంధించినవి కాగా, మరో పది కేసులు బ్లీచింగ్‌ ద్రావణం వినియోగానికి సంబంధించినవి. మిగిలిన కేసులు ఇతర క్రిమి సంహారకాల వినియోగానికి సంబంధించినవని ఆరోగ్యశాఖ ప్రతినిధి మీడియాకు వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు