షరీఫ్‌కు చెప్పులదండ వేసి సరిహద్దుల వెంబడి పరుగెత్తిస్తే రూ.20 లక్షల బహుమతి

ఆదివారం, 21 మే 2017 (10:39 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాష్ షరీఫ్‌కు చెప్పుల దండ వేసి ఇండోపాక్ సరిహద్దుల వెంబడి పరుగెత్తిస్తే రూ.20లక్షల బహుమతి ఇస్తామని కోల్‌కతాకు చెందిన ఓ ముస్లిం మతపెద్ద ఆఫర్‌ చేశారు. అదీ కూడా కుల్‌భూషణ్ యాదవ్ చెప్పులతో కూడిన దంట వేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల పెద్ద పెద్ద మైకులు పెట్టొద్దంటూ వ్యాఖ్యానించిన బాలీవుడ్‌ సింగర్‌ సోనూ నిగమ్‌‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసి సయ్యద్‌ షా అతీఫ్‌ అలీ అల్‌ క్వాదేరి జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనే తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
 
‘కుల భూషణ్‌ జాదవ్‌ ఉపయోగించిన చెప్పులను, షూలను దండగా తయారుచేసి దాన్ని తీసుకెళ్లి పాకిస్థాన్‌ ప్రధానీ నవాజ్‌ షరీఫ్‌ మెడలో వేసి ఎవరు అతడి భారత సరిహద్దు చుట్టూ పరుగెత్తిస్తారో వారికి రూ.20లక్షలు బహుమతిగా ఇస్తాను. పాకిస్థాన్‌ తాను ముస్లిం దేశం అని చెప్పుకుంటోంది. కానీ, ఉగ్రవాదానికి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడం ప్రధాని తప్పకుండా చేయాల్సిన పని. కానీ, అతడు ఫెయిల్‌ అయ్యాడు’ అని ఆయన చెప్పారు. ఎన్నో ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి