ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ వైరస్ బారిన పడి విలవిలలాడుతుంటే ఉత్తరకొరియా మాత్రం కరోనా ఫ్రీ కంట్రీ అని పేర్కోనడం అనుమానాలకు తావిస్తోందని ప్రపంచ మేధావులు, నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా సరిహద్దులను మూసివేయడంతోనే కరోనాను నియంత్రించగలిగామని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
కొరియాలో కరోనా పేట్రేగే సమయానికి రోజుకు పది వేల మందికిపైగా పరీక్షలు చేసే స్థాయికి ఆ దేశం చేరుకుంది. టెస్టింగ్ సెంటర్లతోపాటు హాస్పిటళ్లలో ఫోన్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓ ప్రదేశంలో కరోనా కేసులు నమోదైతే.. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు మొబైల్ ఫోన్ ద్వారా సందేశాలు పంపి.. అటు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. కనీసం 15 కొరియా సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి.