కరోనా వైరస్ విలయతాండవం.. అమెరికా అగ్రస్థానం..

శనివారం, 4 జులై 2020 (14:46 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శుక్రవారం రెండు లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,11,91,681 మంది కరోనా బారిన పడ్డారు. 
 
కరోనా మహమ్మారి కారణంగా 5,29,127 మంది మృతి చెందారు. ప్రాణాంతకర వైరస్ నుంచి కోలుకుని 63,30,671 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధిక కరోనా కేసుల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
 
అమెరికాలో శుక్రవారం ఒక్కరోజే 57,683 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం 28,90,588 మంది కరోనా బారినపడ్డారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి 728 మంది ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు