నైజీరియాలో మెనింజైటిల్ వ్యాధి వ్యాపిస్తోంది. ఈ మెదడు వాపు వ్యాధి కారణంగా కేవలం వారం రోజుల వ్యవధిలోనే 489 మంది మృత్యువాత పడ్డారు. మరో ఐదువేల మందికీ ఈ ప్రాణాంతక వైరస్ సోకింది. దీంతో నైజీరియాలో ఎమెర్జెన్సీ ప్రకటించారు. దీనికి విరుగుడుగా పనిచేసే బెక్స్‌సెరో వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నైజీరియా దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
అయితే, ప్రపంచ వ్యాప్తంగా బెక్స్‌సెరో వ్యాక్సిన్ కొరత ఉండడంతో తమ దేశంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జంపారా, కత్సిన, కెబ్బీ, నైగర్, సొకొటో రాష్ట్రాల్లో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉందని ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇప్పటికే 4,637 కేసులను నిర్ధారించామని, నైజీరియా వ్యాప్తంగా టీకాల వేసేందుకు ప్రచారం చేపట్టామని.. మెదడు వాపు ద్వారా వెన్నెముక- మెదడు అధికంగా దెబ్బతింటుందని.. తద్వారా మృతుల సంఖ్య పెరుగుతోంది. జంపారాలో మాత్రం 216 మంది మృతి చెందారని, మరణించిన వారిలో చిన్నారులే అధికంగా ఉన్నారని వెల్లడించారు.