రోడ్లపైనే కరోనా శవాలు.. మార్చురీలు మూత.. అట్టడబ్బాల తయారీ..

శనివారం, 25 ఏప్రియల్ 2020 (11:59 IST)
కరోనా మహమ్మారికి అత్యంత ప్రభావిత ప్రాంతంగా ఈక్వెడార్‌లోని గ్వాయాస్ నిలిచింది. కోవిడ్-19 మహమ్మారితో చనిపోయిన వారి సంఖ్య భారీగా నమోదైంది. గ్వాయాస్‌లో ఏప్రిల్ ముందు రెండు వారాల్లో 6700 మంది చనిపోయారు. గ్వాయాస్‌లో చనిపోయినవారి సగటు గణాంకాలతో పోలిస్తే ఈ సంఖ్య 5 వేలకు పైనే ఉంది. అందుకే గ్వాయాస్, ఈక్వెడార్‌లోనే కాకుండా, మొత్తం లాటిన్ అమెరికాలో కోవిడ్-19 వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం అయ్యింది. ఇక్కడ కరోనా వ్యాపించడం వల్ల మాత్రమే జనం చనిపోలేదు. 
 
మహమ్మారి వల్ల నగరంలో వైద్య సదుపాయాలు చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. దాంతో, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వెంటనే అవసరమైన వైద్య సహాయం అందించలేకపోయారు. శవాల సంఖ్య పెరగడంతో అట్ట డబ్బాలను తయారు చేయడం ప్రారంభించారు. ఈక్వెడార్‌లోనే అత్యంత పెద్ద పట్టణం, గ్వాయాస్ రాజధాని అయిన గ్వాయాక్విల్ మార్చురీలో పనిచేసే కేటీ మేజికా "మేం కార్లలో, అంబులెన్సుల్లో, ఇళ్లలో, రోడ్లపై ఉన్న ఎన్నో శవాలను చూశాం అని చెప్పారు. ఆస్పత్రుల్లో తగినన్ని పడకలు లేకపోవడం ఇందుకు కారణమని వారు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు