చితికి నిప్పంటించేటప్పుడు బాధపడటం చూసేవుంటాం. అయితే అక్కడి చితిపెడితే కేరింతలు కొడతారు. తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో ఇది జరిగింది. ఉగ్రవాదులు, సంఘవిద్రోహక శక్తుల నుంచి ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్న 5,250 అక్రమ ఆయుధాలను 15 అడుగుల ఎత్తులో వరుసగా ఏర్పాటుచేసిన దండాలకు చితిలా పేర్చి పెట్రోల్ కుమ్మరించి నిలువునా దహనం చేశారు.
సోమాలియాలో పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలను సరఫరా చేస్తున్నదన్న విలియమ్.. ఇకపై అలాంటి చర్యలను ఉపేక్షించబోమని ఉగ్రవాదులను హెచ్చరించారు. ఇప్పుడు కాల్చేసినవి కాకుండా కెన్యాలో మరో ఐదు లక్షల అక్రమ ఆయుధాలు ఉన్నట్లు, అతి త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుని తగలబెడతామన్నారు.