పూర్తి వివరాల్లోకి వెళితే.. జోర్డాన్ వ్యాలీకి చెందిన సులేమాన్ హసన్ (12) గతేడాది తన ఇంటి వద్ద సైకిల్ తొక్కుతుండగా కారు ఢీకొట్టింది. దీంతో, తల, వెన్నెముక కలిసే చోట లిగమెంట్లు తెగిపోవడంతో అంతర్గతంగా తల, వెన్నెముక వేరయ్యాయి.
చికిత్స కోసం అతడిని జెరూసలేంలోని ఈన్ కెరెమ్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు బాలుడి పరిస్థితి చూసి తొలుత షాకైపోయారు. అంతటితో ఆగకుండా బాలుడికి ఆపరేషన్ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న స్పెషలిస్టు వైద్యులు, నర్సులు కొన్ని గంటల పాటు కష్టపడి ఆపరేషన్ పూర్తి చేశారు.
కొత్త కణాలు, నాడులను తిరిగి జోడించడంలో తాము పడ్డ కష్టం మాటల్లో వర్ణించలేమని వైద్యులు చెప్పారు. ఏడాది క్రితం ఈ ఆపరేషన్ జరగ్గా హసన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. దీంతో, అతడిని డిశ్చార్జ్ చేశారు.