11 సంవత్సరాల పాటు కడుపులోనే ఉండిన బల్బ్.. ఆపరేషన్‌తో వెలికి తీసి.. ప్లగ్‌లో పెట్టి చూస్తే వెలిగింది!!

శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (11:47 IST)
సౌదీ అరేబియాలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కడుపు నుంచి ఎల్‌ఈడీ బల్బును బయటకు తీశారు వైద్యులు. కడుపు నుంచి బయటికి ఆ బల్బు కండిషన్ అద్భుతంగా ఉందట. ప్లగ్‌లో పెట్టి చూస్తే ఆ లైటు వెలిగింది. సౌదీకి చెందిన స్థానిక వెబ్ సైట్ ఈ న్యూస్‌ను పబ్లిష్ చేసింది. వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలోని అల్ అషాకు చెందిన 21 ఏళ్ల యువకుడు కడుపునొప్పి కారణంగా ఆస్పత్రికిలో చేర్చారు.
 
డాక్టర్లు అతనికి సిటీ స్కాన్ తీశారు. ఈ స్కాన్ రిపోర్టులో అతని కడుపులో అనుమానాస్పద వస్తువున్నట్లు గుర్తించారు. తీరా చూస్తే.. అది బల్బు అని తేలింది. ఆపరేషన్ చేయడం ద్వారా వైద్యులు బయటికి తీశారు. పదేళ్ల వయస్సులో ఆ యువకులు బల్బును మింగేసినట్లు తెలిసింది. 11 సంవత్సరాల పాటు ఆ బల్బు అతని కడుపులోనే ఉండిపోయిందని.. ఈ బల్బును వెలికితీశామని.. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి నిలకడగా ఉందని.. మెల్లమెల్లగా అతడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి