భారత విదేశాంగ మంత్రి జయశంకర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమావేశం అయ్యారు. కశ్మీర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. కశ్మీర్ సమస్యను భారత్ – పాకిస్థాన్ రెండు దేశాలు కలిసి చర్చించుకుని పరిష్కరించుకుంటాయని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ.. మరే దేశం జోక్యం కానీ అవసరం లేదని జయశంకర్ మైకేల్ పాంపియోకు క్లియర్ గా చెప్పారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్ తన కామెంట్స్ తో సంచలనం రేపారు. కశ్మీర్ విషయంలో మీడియేషన్ చేయాలని భారత ప్రధాని, పాక్ ప్రధాని తనను అడిగారని ట్రంప్ చెప్పడంపై పెద్ద దుమారం రేగింది. ట్రంప్ మాట్లాడిన తర్వాత.. భారత్, పాక్ దేశాలు మొట్టమొదటగా చర్చించుకున్నది బ్యాంకాక్ లోని ఆసియాన్ సదస్సులోనే. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లోనే… కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ తోనే తేల్చుకుంటామని.. అమెరికాకు తేల్చిచెప్పింది ఇండియా.