బెలూచిస్థాన్ ప్రావిన్స్ నుంచి డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోకి ప్రవేశిస్తుండగా లక్ష్మణ్‌ను అరెస్టు చేసినట్టు పాక్ ప్రకటించింది. తానో గూఢచారినని రాజు లక్ష్మణ్ అంగీకరించాడనీ, అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు రాజుని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా గూఢచార్య ఆరోపణలపై భారత మాజీ నేవి అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను పాక్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు పాకిస్థాన్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు స్టే విధించి, శిక్షను పునఃపరిశీలించాల్సిందిగా పాకిస్థాన్ సర్కారును ఆదేశించింది.