డొనాల్డ్ ట్రంప్‌తో భారతీయ ఐటీకి కష్టకాలం.. వీసా ఆంక్షలు సైతం పీడకల?!

సెల్వి

శనివారం, 16 నవంబరు 2024 (19:16 IST)
Donald Trump
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడంతో భారత ఐటీ పరిశ్రమపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన మొదటి టర్మ్‌లో ప్రధాన ఐటీ కంపెనీలకు ఇబ్బందులను తెచ్చిపెట్టిన కొన్ని విధానాలను ట్రంప్ పునరుద్ధరించవచ్చని నిపుణులు భయపడుతున్నారు. 
 
ఆఖరిసారి పదవిలో ఉన్నప్పుడు, ట్రంప్ ఒబామా స్థోమత రక్షణ చట్టాన్ని రద్దు చేయడానికి ప్రయత్నించారు. ఇది హెల్త్‌ప్లాన్ సేవలలో విప్రో $500 మిలియన్ల పెట్టుబడిని ఆలస్యం చేసింది. దిగుమతులపై 20% సుంకాలు విధిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడంతో ఈసారి భారతీయ ఐటీ సంస్థలు మరో గందరగోళ పరిస్థితులు ఎదుర్కోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
వీసా ఆంక్షలు భారతీయులకు మరో పీడకల కానున్నాయి. టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి భారతీయ టెక్ దిగ్గజాలు యుఎస్‌లో స్థానికంగా నియామకం చేసే అవకాశాలున్నాయి. తద్వారా క్లయింట్లు ఐటి బడ్జెట్‌లను తగ్గించుకున్నా పర్వాలేదు అనుకుంటున్నాయి.
 
ఆరోగ్య సంరక్షణ, రిటైల్, బ్యాంకింగ్ రంగాలు, భారతీయ ఐటీ ఆదాయంలో మూడింట ఒక వంతును నడుపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు ఇది రెండో విజయం కాబట్టి.. ఇది విదేశీ కంపెనీలపై మరింత కఠినంగా ఉండబోతోందనే టాక్ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు