ఇమిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై స్టే విధిస్తూ సియాటెల్ న్యాయమూర్తి రాబర్ట్‌ను ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొన్నారు. వీటిపై డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. కోర్టులు అడ్డంపడ్డా, తనలో దూకుడు తగ్గబోదని తేల్చి చెప్పారు.
ఆ జడ్జికి పిచ్చి పట్టిందని, అందుకే ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాడని, ఆయనపై కేసు పెట్టి జైల్లో పెట్టాలని నిప్పులు చెరిగారు. ఎంతో మంది చెడ్డవారిని అమెరికాకు తీసుకువచ్చి ఇక్కడి ప్రజలకు శాంతి లేకుండా చేయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని అన్నారు.
రాబర్ట్ తీర్పు పట్ల ఐఎస్ఐఎస్ సహా పలు ఉగ్రవాద సంస్థలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఆయన తన భయంకరమైన తీర్పును సవరించుకోవాలని సలహా ఇచ్చారు. కాగా, తనకు వ్యతిరేకంగా తీర్పు రావడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేక ఇలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు.