అరేబియా సముద్రంలో 20 మంది భారతీయ ప్రయాణికులతో వెళుతున్న నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. ఎంవీ కెమ్ ఫ్లూటో అనే వాణిజ్య నౌకలో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఈ దాడి జరిగింది. ఈ ద్రోన్ దాడిలో ఓ ఒక్కరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ పోర్టుకు 217 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ దాడి జరిగినట్టు గుర్తించారు. దాడి తర్వాత నౌకలో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని భారతీయ నౌకాదళ అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే సముద్ర గస్తీ డోర్నియర్ రంగంలోకి దాడికి గురైన ఎంవీ కెమ్ ఫ్లూటో నౌకతో కమ్యూనికేషన్ సంబంధాలను తిరిగి పునరుద్ధరించిందని వెల్లడించారు.
ఈ దాడికి గురైన నౌకలోని మర్చంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఓ పోర్టు నుంచి క్రూడాయిల్‌తో మంగళురు బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ్ దాడికి గురైన కెమ్ ప్లూటో దిశగా కలిది వెళుతుందని అధికారులు వెల్లడించారు. దాడికి గురైన నౌక సహాయం అందించాలని ఆ ప్రాంతంలోని నౌకలన్నింటికీ సమాచారం అందించని వారు వెల్లడించారు. అయితే, ఎంపీ ఫ్లూట నౌక 11 నాటికన్ మైళ్ల వేగంతో వెళుతుండటంతో ఇతర నౌకలు సాయం అందించలేక పోయాయని తెలిపారు.