ఎబోలా సోకిన నర్సును హత్తుకున్న బరాక్ ఒబామా!

శనివారం, 25 అక్టోబరు 2014 (18:09 IST)
వామ్మో.. ఎబోలా సోకిన నర్సును అమెరికా చీఫ్ బరాక్ ఒబామా హత్తుకున్నారా? నిజమేనండి. ఎబోలా వ్యాధిపై అమెరికా ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి ఆ దేశాధ్యక్షుడు ఒబామా స్వయంగా రంగంలోకి దిగి ఏం చేశారంటే.. ఎబోలా మహమ్మారి బారినపడి కోలుకున్న నర్సు నినా ఫమ్‌ను ఓవల్ ఆఫీసులో కలిశారు. 
 
అంతేగాకుండా.. త్వరగా కోలుకోవడం పట్ల అభినందిస్తూ, ఆమెను హత్తుకుని అమెరికన్లలో ఏర్పడిన అపోహలను పారదోలే ప్రయత్నం చేశారు. ఈ వార్తకు అమెరికా మీడియా విశేష ప్రాచుర్యం కల్పించింది. 
 
డల్లాస్‌లోని ఓ ఆసుపత్రిలో లైబీరియాకు చెందిన ఎబోలా రోగికి చికిత్స అందిస్తుండగా, వ్యాధి నినాకు కూడా సోకింది. దీంతో, మేరీలాండ్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)లో ఆమెకు చికిత్స చేశారు. శుక్రవారం నాడు ఆమె డిశ్చార్జ్ అయింది.

వెబ్దునియా పై చదవండి