ఏంటిది.. అలా చేస్తే బాధపడుతారు... కాఠిన్యంగా ఉండలేను... హోంవర్క్ చేయలేను...

మంగళవారం, 15 అక్టోబరు 2019 (18:51 IST)
క్లాస్ టీచర్ ఇచ్చిన హోం వర్క్ చేయడంలో ఓ చిన్నారి చూపిన విజ్ఞతకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆమె వయసులో చిన్నదే అయినప్పటికీ... కానీ ఆలోచనలో మాత్రం ఎన్నోరెట్లు పెద్దదని తన చేతలతో నిరూపించింది. ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ చిన్నారి చేసిన వ్యాఖ్యలు ఏంటో, ఆమె వివరాలు ఏంటో తెలుసుకుందాం. 
 
అమెరికా, వాషింగ్టన్‌లోని ముర్రేలోని గ్రాంట్‌ ఎలిమెంటరీ స్కూల్లో రిథమ్ పచేకో అనే చిన్నారి నాలుగో తరగతి చదువుతోంది. ఆమెకు క్లాస్ టీచర్ ఓ హోం వర్క్ ఇచ్చింది. అదీ కూడా ఓ లెక్క రూపంలో. ఓ పట్టికలో నలుగురు నాల్గవ తరగతి విద్యార్థినిల బరువులు ఇచ్చి వారిలో తక్కువ బరువున్న విద్యార్థిని కంటే ఇసాబెల్‌ ఎంత ఎక్కువ బరువుందో కనుక్కొమంది.
 
అయితే ఈ లెక్క పచేకోకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో వర్క్‌బుక్‌ మీద తాను ఈ లెక్కను చేయలేనని నిక్కచ్చిగా చెప్పింది. అలా పేర్కొనడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది. పచేకో తన నోట్స్‌లో 'ఏంటిది.. ఇది వారిని చాలా బాధపెడుతుంది. నేను ఇంత కఠినంగా ఉండాలనుకోవడం లేదు. ఈ లెక్కను నేను చేయడం లేదు. మీరిచ్చిన సమస్య చాలా బాగుంది. కానీ ఓ మనిషి మిగతా వారి కంటే ఎంత ఎక్కువ బరువుందో కనుక్కొమనడం నాకు నచ్చలేదు. అందుకే మీరిచ్చిన హోం వర్క్‌ను నేను చేయడం లేదు' అని తెలిపింది. 
 
మ్యాథ్స్‌ టీచర్‌ కూడా ఆ చిన్నారి చూపిన విజ్ఞతకు సంతోషించింది. వెంటనే దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దాంతో నెటిజన్లు కూడా పచేకో చేసిన పనిని అభినందిస్తున్నారు. అంతేకాక ఇలాంటి తలకు మాసిన సిలబస్‌ను తయారు చేసిన అధికారులను విమర్శిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు