కానీ మోడీ కాశ్మీర్ విషయంలో శాంతిని కోరుకోవట్లేదని, అది పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ప్రధానిగా మోడీ చాలా చురుగ్గా పనిచేస్తున్నారని, కాశ్మీర్ విషయంలో మాత్రం ఆయన తీరు శాంతిని కోరుకునేట్లు లేదన్నారు.
ఇక ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌పై ముషారఫ్ ఫైర్ అయ్యారు. యోగి యోగ్యత ఏమిటి? భారత్‌లో లౌకిక విశ్వాసాలు క్షీణిస్తున్నాయి. భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్.. పురోగమించిన.. వివేకం కలిగిన సమాజం అంటూ ముష్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి తాము మద్దతు ఇస్తామని ముషారఫ్ పేర్కొన్నారు.