మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అనేకమంది మహిళలు తమపై జరుగుతున్న అకృత్యాలను ధీటుగా ఎదుర్కోలేక బలైపోతున్నారు. అయితే ఫ్లోరిడాలో ఓ మహిళ తనపై జరిగిన అన్యాయాన్ని ధీటుగా ఎదుర్కొంది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్ రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి వెళ్లాడు. ఆర్డర్ ఇచ్చాడు. రెండు స్ట్రాలు లేవని స్టాఫ్‌ను అడిగాడు.
లాబీల్లో ప్లాస్టిక్ స్ట్రాలు ఇవ్వలేమంటూ డొనాల్డ్స్ ఎంప్లాయి చెప్పింది. అయినా ఆ వ్యక్తి వినకుండా.. క్యాషియర్‌ను తిట్టాడు. అంతేగాకుండా తనకు సర్వ్ చేస్తున్న యువతి కాలర్ పట్టుకుని లాగపోయాడు. అంతే.. ఆ యువతి వెంటనే తేరుకుని ఆ వ్యక్తిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. ఈ ఘటనను మెక్‌డొనాల్డ్స్ కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.