మరోవైపు.. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం ప్రార్థనల సమయంలో వ్యాపార లావాదేవీలను నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆరోజున పెద్ద ఎత్తున నిర్వహించే ప్రార్థనలకు దుకాణాలు తెరిచి ఉండడం వల్ల ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదను ఫత్వా అండ్ లెజిస్లేషన్ డిపార్ట్‌మెంట్‌కు పంపించింది. ప్రతిపాదన కనుక ఆమోదం పొందితే వచ్చే శుక్రవారం నుంచే దుకాణాలపై నిషేధం అమల్లోకి వస్తుంది.