ఏ దేశానికైనా తన భూభాగాన్ని రక్షించుకునే హక్కు ఉంటుందని జర్మనీ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ ఉగ్రవాదమైనా, స్థానిక ఉగ్రవాదమైనా... దేశ భద్రతకు సమస్యగా పరిణమించినప్పుడు దాడులు చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ విషయాన్ని భారత్‌లో జర్మనీ రాయబారి మార్టిన్ నే స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత బలగాలు చొచ్చుకుపోయి, సర్జికల్ దాడులు నిర్వహించడాన్ని జర్మనీ సమర్థిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా చెప్పారు.
ఏ దేశమైనా మరో దేశంలోకి ఉగ్రవాదాన్ని ప్రవేశించనివ్వబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని మార్టిన్ స్పష్టం చేశారు. అంతేకాదు, తన దేశానికి ఇతర ఏ దేశమైనా ఉగ్రవాద రూపంలో హాని తలపెట్టినప్పుడు... తన భూభాగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానికి ఉంటుందని తెలిపారు. ఇవి కేవలం తాను చెబుతున్న మాటలు కావని... అంతర్జాతీయ న్యాయ సమాజం కూడా ఇదే విషయాన్ని చెబుతోందని ఆయన గుర్తు చేశారు.