పాకిస్థాన్ జాతిపిత జిన్నా పేరుతో మద్యం!

గురువారం, 3 డిశెంబరు 2020 (13:37 IST)
పాకిస్థాన్‌ దేశ జాతిపితగా గుర్తింపు పొందిన నేత మహ్మద్ అలీ జిన్నా. అంతటి గొప్ప నేత పేరుతో మద్యం బ్రాండ్ రానుంది. ఇది ఒక్క పాకిస్థాన్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
ఓ నెటిజెన్‌ మహమ్మద్‌ అలీ జిన్నా పేరిట మద్యం ప్రియులకు అందుబాటులోకి వచ్చిన జిన్‌ బాటిల్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. మద్యం పేరును జిన్నా.. అప్‌గ్రేడెడ్‌ జిన్‌ అని ముద్రించారు. బాటిల్ వెనుక వైపున బాజాప్తా జిన్నాకు సంబంధించిన సమాచారాన్ని కొంత ముద్రించి.. ఆ వ్యక్తిని స్మరించుకుంటూ.. అని చెప్పుకొచ్చారు. 
 
భారత్‌లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన జిన్నా.. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రత్యేక పాకిస్థాన్‌ దేశం ఏర్పాటుచేయాలంటూ ఉద్యమం చేశారు. ఆయన పోరాటం కారణంగా పాకిస్థాన్‌ ఏర్పడినందున ఆయనను జాతిపితగా పాకిస్థానీయులు భావిస్తుంటారు. 
 
నిజానికి ఇస్లాంలో మద్యం సేవించడం మహాపాపం. అదేవిధంగా మద్యంను హరామ్‌గా భావిస్తుంటారు. అంత నిక్కచ్చిగా వ్యవహరించే ముస్లింలకు.. జిన్నా పేరిట జిన్‌ రావడం మింగుడుపడటం లేదు.
 
"మంచి స్కాచ్‌, విస్కీ, జిన్‌, పూల్‌బిలియర్డ్స్‌, సిగరెట్లు, పోర్క్‌సాస్‌ ఎంజాయ్‌ చేసిన జిన్నా.. దానిపై వచ్చిన వ్యాఖ్యలను ఎప్పుడూ ఖండించలేదు" అని లేబుల్‌పై రాశారు. దీనిపై పాకిస్థాన్‌ సోషల్‌మీడియాలో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
జాతిపిత జిన్నా పేరిట జిన్ను తేవడమేమిటని పలువురు  ప్రశ్నించారు. సంతోషించాలో.. బాధపడాలో తెలియడంలేదని ఒక నెటిజెన్‌ వ్యాఖ్యానించగా.. దీన్ని జాతీయ పానీయంగా ప్రకటించాలని మరో నెటిజెన్‌ వ్యంగ్యంగా పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు