తల్లి ప్రేమ ఎంత సాహసానికైనా ఒడిగడుతుంది. తన బిడ్డలను కాపాడుకోవడానికి తల్లి ఎంతటి పోటుగాళ్లతోనైనా తలపడుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఇటీవలే చోటుచేసుకుంది. తల్లి తన బిడ్డను శత్రువు బారీ నుండి సురక్షితంగా కాపాడుకుంది. ఇంతకీ ఆ తల్లి ఎవరో కాదు ఎలుక. ఒక సర్పం ఆకలితో నకనకలాడుతుంది. అంతలోనే దానికి ఒక ఎలుక పిల్ల కనిపించింది. దాన్ని నోట కరుచుకుని మింగేందుకు ప్రయత్నించింది.
అంతలోనే వెనుక నుంచి దాని తోకను ఎవరో లాగుతున్నట్లు అనిపించింది. ఎంత గింజుకున్నా ముందుకు కదలలేకపోయింది. తన చిట్టి ఎలుకను నోట కరుచుకుపోతున్న ఓ పామును తల్లి ఎలుక వెంటపడి మరీ తరమికొట్టింది. తన పదునైన పళ్లతో తోకను కొరుకుతూ.... చిట్టెలుకను విడిచిపెట్టే వరకు వదిలి పెట్టలేదు. అంతే పాము తోకను పట్టుకుని కొరకడం మొదలుపెట్టింది. ఇక చేసేదిలేక పాము తన నోటిలో ఉన్న ఎలుక పిల్లను వదిలేసింది.