నిజమైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటో భారత్‌కు రుచి చూపిస్తామని లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించారు. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ దాడులు జరిపి తీవ్రవాదులను హతమార్చిన విషయంతెల్సిందే. ఈ దాడులపై పాకిస్థాన్‌తో పాటు... పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు పగతో రగిలిపోతూ.. దాడులకు ప్రతీకారం తీర్చుకునేలా పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఇందులోభాగంగా, భారత్‌లోకి వంద మంది తీవ్రవాదులను ఒకేసారి పంపిచేలా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే, 'నిజమైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటో భారతకు చూపుతాం' అంటూ హెచ్చరించారు. ఇందుకోసం నియంత్రణ రేఖ వద్ద ముమ్మరంగా పనులు చేపట్టినట్టు సమాచారం. చలికాలంలో మరింతమంది ఉగ్రవాదులు దేశంలో చొరబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది.