ఇమ్రాన్ ఖాన్ పాక్ చేతిలో కీలుబొమ్మ.. కనీసం సానుభూతి కూడా?

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (09:58 IST)
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మ అని రెహామ్ ఖాన్ తెలిపింది. ఏం  మాట్లాడాలన్నా ఆయన సైన్యం వైపు చూస్తారని, మిలిటరీ ఆదేశాలు లేనిదే ఏమీ మాట్లాడలేని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అని దుయ్యబట్టింది.


పుల్వామా దాడిపై ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన కూడా ఈ కోవలోకే వస్తుందని ఆమె అన్నారు. పుల్వామా దాడి ఘటనపై తన స్పందన వెలిబుచ్చేందుకు కూడా సైనికాధికారుల సూచనల కోసం వేచిచూశాడని ఆరోపించారు.
 
మరోవైపు పుల్వామా దాడిపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కనీస సానుభూతి కూడా వ్యక్తం చేయలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రపంచం మొత్తం ఈ ఘటనను ఖండించి సానుభూతి వ్యక్తం చేస్తే.. ఇమ్రాన్ ఖాన్ మాటవరసకైనా సానుభూతి తెలపలేదని విమర్శించారు. 
 
40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైతే ఇమ్రాన్ కనీసం ఖండించకపోగా ఆధారాలు కావాలంటూ డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. సాక్ష్యాలు మీ దేశంలోనే ఉన్నాయని ఘాటుగా బదులిచ్చారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థే ఈ దాడికి పాల్పడిందని, ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిందని జైట్లీ గుర్తు చేశారు. ఇంతకంటే ఆధారాలు కావాలా అని ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు