రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ రియాలిటీ షోలు నిర్వహించే ఆయన.. గురువారం లాస్‌వెగాస్‌లో జరిగిన మూడో ముఖాముఖి చర్చలోనూ డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చాతుర్యం ముందు నిలవలేకపోయారు. ముఖ్యంగా డొనాల్డ్ తన విధానాలకు కట్టుబడి మాట్లాడారు. కాగా.. ఉభయులూ కనీసం కరచాలనం కూడా చేసుకోలేదు. ఎన్నికల ఫలితాలకు ఆమోదం, మహిళల పట్ల వైఖరి, తుపాకులు, విదేశాంగ విధానాలపై మూడో ముఖాముఖిలో సుమారు గంటన్నర పాటు విస్తృత చర్చ జరిగింది. ఫాక్స్ న్యూస్ యాం కర్ క్రిస్ వాలెస్ మోడరేటర్‌గా వ్యవహరించారు.
ఇదిలావుండగా, ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అంగీకరించే విషయమై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్న ఆయన.. ఓటమిని అంగీకరించనని సంకేతప్రాయంగా చెప్పారు. పోలింగ్ రోజైన నవంబరు 8దాకా తన వైఖరిపై సస్పెన్స్ కొనసాగిస్తానని, ఆ రోజున ఏ వైఖరి తీసుకోవాలో చూస్తానని తెలిపారు.