చైనా దేశం శాంతిమంత్రం జరిపిస్తోంది. సరిహద్దుల్లో కీచులాటలు వద్దంటూ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద నెలకొన్న ఉద్రిక్తలు తగ్గించుకునేందుకు ఇండోచైనా సరిహద్దుల్లో సిద్ధమయ్యాయి. ఇందులోభాగంగా, ఇరు వైపులా మూడు దశల్లో బలగాల ఉపసంహరణకు ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చినట్టు ఎఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
నవంబరు 6న చుషుల్ పోస్టులో ఎనిమిదో విడత కోర్ కమాండర్ స్థాయి చర్చల్లో ఈ మేరకు నిర్ణయించారు. తూర్పు లఢక్‌లో ఏప్రిల్‌మే సమయంలో ఇరు దేశాల సైన్యాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెనక్కి వెళ్లాలన్న షరతుకు ఇరు పక్షాలు కట్టుబడి ఉండాలన్న ఒప్పందం అధికారికంగా కుదరాల్సి ఉన్నది. పాంగాంగ్ సరస్సు వద్ద తుది దఫా చర్చలు జరిపి ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.