ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఉగ్రవాదం అనేది 'కామన్ ఛాలెంజ్' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ప్రకటించారు. ప్రపంచంలోని దేశాలన్నింటికీ ఉగ్రవాదమే ఉమ్మడి శత్రువు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ ఎన్నో ప్రయత్నాలు, త్యాగాలు చేసిందని చెప్పారు. అంతర్జాతీయ సమాజం ఆ ప్రయత్నాలను గుర్తించి, గౌరవించాలి. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుందంటూ జావో లిజియన్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో పాకిస్థాన్ భద్రతా బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించాయి. శుక్రవారం మన్‌కోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద పాక్ సైనికులు కాల్పులకు తెగబడినట్టు ఆర్మీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పూంచ్ జిల్లా మన్‌కోట్ సెక్టార్‌లోని ఎల్వోసీ పొడవునా పాకిస్తాన్ సైన్యం తేలికపాటి ఆయుధాలు, మోర్టార్ షెల్స్ ప్రయోగిస్తూ కాల్పులకు దిగింది. భారత సైనికులు పాక్ సైనికులకు ధీటుగా సమాధానం చెప్తున్నారని ఆర్మీ వెల్లడించింది.