ఆప్ఘనిస్థాన్‌కు సాయం చేసేందుకు తాము సిద్ధమని భారత్ తెలిపింది. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన అఫ్గానిస్థాన్‌కు సాయం చేసేందుకు తాము సిద్ధమని భారత్ తెలిపింది. అఫ్గాన్‌లో ఇటీవల సంభవించిన భూకంపం వల్ల 1,000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
భూకంప బాధితులకు, వారి కుటుంబాలకు సానుభూతి భారత్ తెలిపింది. మృతుల కుటుంబాలకు సంతాపం భారత్ తెలిపింది. ఆప్ఘనిస్థాన్ ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి చెప్పారు.
కాగా, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరీందం బాగ్చీ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ఇప్పటికే అఫ్గాన్‌కు సాయంగా భారత్ నుంచి సరుకులు పంపామని, అవి కాబూల్ చేరుకున్నాయని తెలిపారు.
మిగతా సాయం కూడా త్వరలోనే అందుతుదని వివరించారు. కాగా, ఆఫ్గాన్‌కు భారత్ ఇప్పటికే 30 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు, 13 టన్నుల ఔషధాలు, 5 లక్షల డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్లను పంపింది.