ఇకపై ఇండియాలోనే కార్లకు క్రాష్ టెస్ట్ : నితిత్ గడ్కరీ

శుక్రవారం, 24 జూన్ 2022 (14:58 IST)
భారత ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. భారత్‌లో తయారయ్యే కార్లకు ఇక్కడే క్రాష్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా కార్లను క్రాషఅ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్ సీఏపీ టెస్టింగ్ కోసం పంపాల్సిన అవసరం ఇకపై ఉండదని, త్వరలోనే ఎన్ సీఏసీ కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌నే ఎన్ సీఏసీగా పిలుస్తుమంటారు. కొత్త కార్లకు సంబంధించిన సామర్థ్య పరీక్షలు నిర్వహించి రేటింగ్ ఇవ్వడం ఎన్ సీఏపీ విధి. భారత్ ఎన్ సీఏపీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఆయన శుక్రవారం వెల్లడించారు. 
 
'భారత్ ఎన్ సీఏపీ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌‌నకు ఇప్పుడే ఆమోదం తెలిపాను. క్రాష్ పరీక్షల్లో చూపించిన పనితీరు ఆధారంగా వాహనాలకు రేటింగ్‌లు ఇస్తాం. స్టార్ రేటింగ్‌ల ఆధారంగా కస్టమర్లు సురక్షితమైన కారును ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. దీంతో సురక్షితమైన కార్లను తయారు చేసే విషయంలో కంపెనీల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించినట్టు అవుతుంది అని ఆయన అన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు