ఐదుగురితో కూడిన తన బృందం కరోనా వైరస్‌పై విజయం సాధించిందని, సార్స్ ను అంతం చేసిన యాంటీ బాడీస్ కరోనాపైనా పని చేశాయని, డాక్టర్ జాకబ్ పేర్కొన్నారు.
వాస్తవానికి కరోనా వైరస్ మానవ శరీరంలోని ఎస్ - ప్రొటీన్ కణాల ద్వారా ప్రవేశిస్తుందని, తాము ప్రయోగించిన యాంటీ బాడీస్, ఎస్ - ప్రొటీన్ ను నిర్వీర్యం చేస్తున్నాయని, తద్వారా కరోనా వైరస్ కూడా నాశనం అవుతోందని ఆయన అన్నారు.
ప్రస్తుతం మనుషులపై క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వాక్సిన్, సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశామని వెల్లడించారు. తమ ప్రయోగ ఫలితాలను మరో రెండు ల్యాబ్స్ సాయంతో నిర్ధారించుకుంటున్నామని జాకబ్ గ్లాన్ విల్లె వెల్లడించారు.