కరోనా బాధితుల కోసం 20వేల రైల్వే బోగీల్లో క్వారంటైన్ లేదా ఐసోలేషన్ పడకలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ప్రణాళిక విజయవంతమైతే 3.2లక్షల పడకలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా వైరస్ బాధితుల కోసం చైనా కేవలం10 రోజుల్లో వేయి పడకల ఆసుపత్రి నిర్మించి, తన శ్రామిక శక్తిని ప్రపంచానికి తెలియజేసింది.
అయితే భారత్ వినూత్నంగా ఆలోచించి కదిలే ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. అది కూడా ఒకటి రెండు కాదు. ఏకంగా 3.2 లక్షల పడకలు.