స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.25 గంటలకు ఖార్గ్ యుద్ధనౌకపై మంటలు ప్రారంభమైనట్లు ఇరాన్ స్టేట్ టీవీ తెలిపింది. ఈ యుద్ధనౌకపై సైనిక విన్యాసాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇరాన్‌కు చెందిన అతిపెద్ద యుద్ధనౌకను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లైఫ్ జాకెట్లు ధరించిన సిబ్బంది సభ్యుల వీడియో ఇరాన్‌లో వైరల్ అవుతుంది. సిబ్బంది వెనుక ఓడ మంటల్లో కనిపిస్తుంది.
ఈ యుద్ధనౌకను బ్రిటన్‌లో నిర్మించారు. 1977 లో సముద్రంలో అందుబాటులోకి తీసుకురాగా.. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత 1984 లో ఇరాన్ నావికాదళానికి తిరిగి కేటాయించారు. యుద్ధనౌక భారీ సరుకును ఎత్తడమే కాకుండా ఏకకాలంలో టేకాఫ్, అనేక హెలికాప్టర్లను ల్యాండింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉంది.