జోన్న పలని అంటేనే ఐసిస్ టెర్రరిస్టుల కన్నుల్లో నిద్రలేకుండా పోతోంది. ఎప్పుడూ రైఫిల్స్‌తో రఫ్‌గా కనిపించే ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం స్మార్ట్‌గా కనిపిస్తుంటుంది. ఫేస్‌బుక్‌లో అందమైన ఫొటోలు అప్‌లోడ్ చేస్తుంటుంది. తనను ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తులు ఇద్దరు.. ఒకరు బరాక్ ఒబామా.. మరొకరు జోన్న పలని అని అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత డోనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశాడంటూ ఓ ఫొటో ఆమె ఫేస్‌బుక్‌లో కనిపిస్తుంది.
రెండేళ్ల పోరాటం తర్వాత 15 రోజుల వెకేషన్‌పై కోపెన్‌హెగన్‌లోని ఇంటికి చేరుకున్నానని.. అక్కడికొచ్చాక పాస్ పోర్టు వాలిడిటీ లేదని, శరణార్థుల నియమాలు ఉల్లంఘించారని డెన్మార్క్ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది. నిబంధనలు, చట్టాల పేరిట కొన్నేళ్ల పాటు జైలులో ఉండొచ్చు.