టర్కీలో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో పెను విషాదం జరిగింది. ఇస్తాంబుల్‌లోని నైట్ క్లబ్‌లో ఓ గుర్తు తెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. గత ఏడాది అమెరికాలోని ఓర్లాండోలో ఇదే తరహాలో ఓ నైట్‌క్లబ్‌లో దుండగుడు కాల్పులు జరిగిన ఘటనలో దాదాపు 50 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్టకోయ్‌లోని నైట్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇస్తాంబుల్ గవర్నర్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. న్యూ ఇయర్ వేడుకులు జరుగుతుండగా నైట్ క్లబ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. కాల్పులు జరిగిన సమయంలో దాదాపు 500 మంది నైట్ క్లబ్‌లో వేడుకల్లో పాల్గొన్నారు. సాయుధుడు నైట్‌క్లబ్‌లో కాల్పులు జరపక ముందు ఓ పోలీసు అధికారి, ఓ పౌరుడిపై కాల్పులకు తెగబడ్డాడు.