26 ఏళ్ల యువకుడు జపాన్ రాజధాని టోక్యోలో బీభత్సం సృష్టించాడు. ఓ కేర్ హోమ్‌ను టార్గెట్ చేసుకున్న ఆ యువకుడు మానసిక వికలాంగులపై విచక్షణారహితంగా కాల్చి చంపాడు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. కేర్‌హోమ్‌పై నల్ల బట్టలు ధరించిన ఓ దుండగుడు సాగమిహర వికలాంగుల ఆశ్రమంలోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.