ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే వెల్లడించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పార్టీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉత్తర కొరియా దూకుడును నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జపాన్‌లో పర్యటించనున్నారు. అయితే అప్పుడు నార్త్ కొరియా అంశాన్ని ట్రంప్‌తో చర్చించనున్నట్లు అబే తెలిపారు. రష్యా, చైనాలతోనూ ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. పదేపదే అణుపరీక్షలతో బెంబేలెత్తిస్తున్న నార్త్ కొరియాపై బలమైన ఒత్తిడి తీసుకురానున్నట్లు అబే చెప్పారు.