చైనాలో కరోనా కేసులు వున్నాయని రాసినందుకు జర్నలిస్టుకు 4 ఏళ్లు జైలు

మంగళవారం, 29 డిశెంబరు 2020 (15:14 IST)
చైనా మరో కర్కశమైన చర్య తీసుకుంది. తమ దేశంలో కరోనా వైరస్ కేసులు వున్నాయంటూ రాసిన నలుగురు జర్నలిస్టులను అరెస్టు చేసి జైలులో పెట్టింది. కరోనావైరస్ సంబంధ పరిస్థితిని ఎవరైనా బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే వారిపై చైనా కఠినంగా వ్యవహరిస్తుందనేందుకు ఇదో నిదర్శనం.
 
కరోనావైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిందని అగ్రరాజ్యం అమెరికా ఎ్పపటినుంచో వాదిస్తోంది. వుహాన్ నగరంలో కరోనావైరస్ పరిస్థితి గురించి చైనాకు చెందిన నలుగురు జర్నలిస్టులు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వార్తలు రాసారు.
 
దీనిపై చైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ వార్తలు రాసిన జర్నలిస్టులను జైలులో పెట్టింది. వారిలో ఇద్దరిని విడుదల చేయగా ఓ జర్నలిస్టుకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా నాలుగో జర్నలిస్టు ఏమయ్యారనేది సస్పెన్సుగా మారింది. ఆ జర్నలిస్టు ఏమయ్యారో కూడా ఇప్పటివరకూ అంతుబట్టడంలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు