వాయవ్య పాకిస్థాన్‌లో బాలబాలికలందరికీ విద్యా హక్కును అమలు చేయాలంటూ పోరాడుతున్న మలాలాపై గతంలో తాలిబన్ ఉగ్రవాదులు హత్యా యత్నం చేసినా.. అలాంటి భయానక పరిస్థితిలో కూడా ఆమె మహిళలు, బాలికలు, ప్రజల హక్కుల పట్ల నిబద్ధత కనబరచడంతో ఈ అరుదైన ఉన్నత గౌరవం ఆమెకు దక్కిందని తెలిపారు. తద్వారా అతి చిన్న వయస్సులో ఈ అవార్డును గెలుచుకున్న వ్యక్తిగా మలాలా రికార్డు సాధించింది.