ప్రేయసిని మెప్పించాలనీ... రెండు భవనాల సందులో ఇరుక్కున్న ప్రియుడు

బుధవారం, 24 ఆగస్టు 2016 (11:46 IST)
సాధారణంగా తమ ప్రియురాళ్ళను మెప్పించాలని పలువురు ప్రియుళ్ళు వింతవింత సాహసాలు చేస్తుంటారు. అలా చేసే వారిలో కొందరు విజయం సాధిస్తుంటారు.. మరికొందరు విఫలమవుతుంటారు. తాజాగా ఓక్లాండ్‌లో ఓ ప్రియుడు ఇదే తరహా సాహసానికి శ్రీకారం చుట్టి రెండు భవనాల మధ్య ఇరుక్కుపోయి, 4 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఓక్లాండ్కు చెందిన ఓ అబ్బాయికి ఇదే పరిస్థితి ఎదురైంది. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి భవనం‌పై అంతస్తుకు వెళ్లిన యువకుడు ఆమెను ఇంప్రెస్ చేసేందుకు పక్క భవనంపైకి దూకే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పట్టుదప్పి కాలు జారి రెండు భవనాల సందులో పడ్డాడు. దాదాపు 4 గంటలపాటు అందులో ఇరుక్కుపోయి నరకం చూశాడు. పీటర్స్‌బర్గ్‌కు చెందిన అత్యవసర సేవల విభాగ అధికారులు గోడలకు రంధ్రం చేసి అతడిని బయటకు తీశారు. 
 

వెబ్దునియా పై చదవండి