నోటీసులో, ధనుష్ లీగల్ టీమ్ ఇలా పేర్కొంది. "నానుమ్ రౌడీ ధాన్ సినిమాపై నా క్లయింట్ కాపీరైట్‌ను ఉల్లంఘించే కంటెంట్‌ను తీసివేయమని మీ క్లయింట్‌కు సలహా ఇవ్వండి. 24 గంటలలోపు అలా చేయడంలో విఫలమైతే, మీ క్లయింట్, నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై రూ.10 కోట్ల నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయడంతో సహా తగిన చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా నా క్లయింట్‌ను ఒత్తిడి చేస్తుంది." అని తెలిపారు.
మైనర్ క్లిప్‌పై నష్టపరిహారం కోరడం ద్వారా ధనుష్ దిగజారాడని నయనతార తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. నయనతార బహిరంగ లేఖను పోస్ట్ చేసిన తర్వాత ఈ వివాదం మరింత పెరిగింది. ప్రతిస్పందనగా, ధనుష్ న్యాయవాది ఆమె వాదనలను తిరస్కరించారు.
ఆ క్లిప్ వ్యక్తిగత ఫుటేజ్ కాదని, ప్రొడక్షన్ టీమ్‌కి చెందినదని నొక్కి చెప్పారు. "నా క్లయింట్ ఈ చిత్రానికి నిర్మాత, దాని నిర్మాణానికి అయ్యే ఖర్చుల గురించి పూర్తిగా తెలుసు" అని ప్రకటనలో పేర్కొనడం జరిగింది.