భారత్‌లో ఎబోలా కేసు.. లైబీరియా నుంచి వచ్చిన ప్రయాణికుడికి...!

బుధవారం, 19 నవంబరు 2014 (11:19 IST)
భారత్‌లో ఒక ఎబోలా కేసు బయటపడింది. లైబీరియా నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ఒక ప్రయాణికుడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎబోలా వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయ ఆస్పత్రిలోని ఐసోలేటెడ్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
 
ఎబోలా సోకిన వ్యక్తిని లైబీరియా నుంచి వచ్చిన సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా, ఎబోలా వైరస్ ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆ వెనునెంటనే అక్కడి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. దీంతో దేశంలోని మిగిలిన అన్ని విమానాశ్రయాల వద్ద వైద్య పరీక్షలను ముమ్మరం చేశారు. 

వెబ్దునియా పై చదవండి