ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా రికార్డు స్థాయిలో 75 మంది భారతీయ అమెరికన్లను తన పాలనా యంత్రాంగంలో నియమించారు. అయితే ఈ రికార్డును డొనాల్డ్ ట్రంప్ అధిగమిస్తారనే టాక్ వస్తోంది. ఫలితంగా డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగంలో ప్రముఖ భారతీయ అమెరికన్లు భాగస్వాములయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలను హర్మీత్ వ్యాఖ్యలు మరింత బలపరిచాయి. డొనాల్డ్ ట్రంప్ వ్యాపార దిగ్గజం కావడంతో ప్రతిభావంతులను ఎంపిక చేయడంలో నిపుణుడని ధిల్లాన్ చెప్తున్నారు.
వచ్చే ఏడాది జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అత్యుత్తమ ప్రతిభావంతులను నియమించుకోవడంలో దిట్ట అంటూ పేర్కొన్నారు. అమెరికా పాలనలో తనకు సహకరించేందుకు అత్యుత్తములను ఎంపిక చేసుకోవాలని ట్రంప్ కోరుకుంటున్నారని హర్మీత్ చెప్పారు. ప్రముఖ భారతీయ అమెరికన్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉందని తెలిపారు.
అంతేగాకుండా డొనాల్డ్ ట్రంప్ విజయంతో అమెరికన్లకు కొత్త అవకాశాల శకం ప్రారంభమైందని, దీనివల్ల భారతీయ అమెరికన్లకు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అమెరికా పరిపాలనలో భారతీయ అమెరికన్‌ను నియమించిన అమెరికా ప్రెసిడెంట్లలో రోనాల్డ్ రీగన్ మొదటివారని ధిల్లాన్ గుర్తుచేశారు. ట్రంప్ విజయంలో భారతీయ అమెరికన్ల మద్దతు కూడా ఉండదని హర్మీత్ కౌర్ వెల్లడించారు.